![]() |
![]() |

`ఉగ్రమ్` (2014)తో కన్నడనాట దర్శకుడిగా తొలి అడుగేసిన ప్రశాంత్ నీల్.. మొదటి ప్రయత్నంలోనే మెమరబుల్ హిట్ అందుకున్నాడు. ఆపై పాన్ - ఇండియా మూవీగా రిలీజైన ప్రశాంత్ ద్వితీయ చిత్రం `కేజీఎఫ్ః చాప్టర్ 1`(2018) .. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. కట్ చేస్తే.. రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న `కేజీఎఫ్ః చాప్టర్ 2`తో `హ్యాట్రిక్` డైరెక్టర్ అనిపించుకున్నాడు ప్రశాంత్ నీల్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కేవలం `కేజీఎఫ్ః చాప్టర్ 2` సినిమాతోనే కాదు.. ఇద్దరు మెయిన్ టెక్నీషియన్స్ కాంబినేషన్ లోనూ `హ్యాట్రిక్` అంకాన్ని పూర్తిచేశాడు ప్రశాంత్. ఆ ఇద్దరు మరెవరో కాదు.. సంగీత దర్శకుడు రవి బస్రూర్, ఛాయాగ్రాహకుడు భువన్ గౌడ. ప్రశాంత్ రూపొందించిన తొలి మూడు సినిమాలకు రవి బస్రూర్ సోలో కంపోజర్ గా పనిచేయగా.. భువన్ గౌడ మాత్రం `ఉగ్రమ్`కి ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరిగానూ, `కేజీఎఫ్` సిరీస్ కి సోలో కెమెరామ్యాన్ గానూ వర్క్ చేశాడు. ఏదేమైనా.. ప్రశాంత్ కాంబోలో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ దక్కినట్లయ్యింది. మరి.. ప్రశాంత్ నీల్ నాలుగో చిత్రం `సలార్`కి కూడా కంటిన్యూ అవుతున్న రవి బస్రూర్, భువన్ గౌడ.. మరోసారి అచ్చొస్తారేమో చూడాలి.
![]() |
![]() |