![]() |
![]() |

రీసెంట్ గా `బీస్ట్`గా పలకరించాడు కోలీవుడ్ స్టార్ విజయ్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అయితే, ఓపెనింగ్స్ మాత్రం బాగున్నాయి.
ఇదిలా ఉంటే, `బీస్ట్` తరువాత ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు విజయ్. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ కి జంటగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న నటిస్తుండగా.. ఓ ముఖ్య పాత్రలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ దర్శనమివ్వనున్నారని సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజయ్ కి తండ్రి పాత్రలో శరత్ కుమార్ కనిపిస్తారట. అంతేకాదు.. ఎంతో పవర్ ఫుల్ గా తన పాత్ర ఉంటుందని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. కుదిరితే ఈ ఏడాది దీపావళి స్పెషల్ గా లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
![]() |
![]() |