![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. వరుణ్ తొలి చిత్రం `ముకుంద` (2014)లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే.. ఆపై `గద్దలకొండ గణేశ్`(2019)లోనూ సందడి చేసింది. వీటిలో `గద్దలకొండ గణేశ్` బాక్సాఫీస్ ముంగిట మంచి విజయం సాధించింది.
ఇదిలా ఉంటే.. స్వల్ప విరామం అనంతరం వరుణ్ తో ముచ్చటగా మూడోసారి జట్టుకట్టింది పూజ. ఆ వివరాల్లోకి వెళితే.. బ్లాక్ బస్టర్ మూవీ `ఎఫ్ 2`(2019)కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3`లో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ లో ఎంటర్టైన్ చేయనుంది. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని పరోక్షంగా అనౌన్స్ చేసేశారు కూడా. అంతేకాదు.. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ తో కలిసి పూజ చిందులేస్తున్నట్లు ఓ వర్కింగ్ స్టిల్ కూడా లీక్ అయిపోయింది. మరి.. ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వరుణ్, పూజ.. ఈ సారి ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చూడాలి.
కాగా, వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న `ఎఫ్ 3`ని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు. ఇందులో వెంకీకి జంటగా తమన్నా నటిస్తుండగా.. వరుణ్ తేజ్ కి జోడీగా మెహ్రీన్ దర్శనమివ్వనుంది. వేసవి కానుకగా మే 27న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ జనం ముందుకు రానుంది.
![]() |
![]() |