![]() |
![]() |

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా థియేటర్లలో రిలీజైంది. చాప్టర్ 1 బ్లాక్‌బస్టర్ అవడంతో చాప్టర్ 2పై వెల్లువెత్తిన అంచనాలు అసాధారణం. ఆ అంచనాలను మించి ఈ సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తోందని అన్ని చోట్ల నుంచీ రిపోర్టులు వస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి 2', 'దంగల్' సహా అన్ని భారతీయ సినిమాల రికార్డులను 'కేజీఎఫ్ చాప్టర్ 2' తిరగ రాసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒక చిన్న లైన్ పట్టుకొని 'కేజీఎఫ్ 2'ను ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానానికి ఆడియెన్స్ దాసోహమవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ తమ ఒంట్లోని రక్తం ఏదో తెలీని ఉద్వేగంతో పరవళ్లు తొక్కుతూ వచ్చిందని పలువురు ప్రేక్షకులు చెప్తున్నారు. గరుడను చంపి కోలార్ గోల్డ్ మైన్స్‌కు కొత్త అధిపతి అయిన రాకీ భాయ్‌గా యశ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. అతని క్యారెక్టరైజేషన్, అతని మేనరిజమ్స్, అతని డైలాగ్స్, అతని ఫైట్స్, అతని స్టైల్.. అన్నింటినీ జనం ఎంజాయ్ చేస్తున్నారు.
యాక్షన్ సీన్లను డిజైన్ చేసిన విధానం కేవలం యాక్షన్ ప్రియులనే కాకుండా అందర్నీ ఆకట్టుకుంటున్నాయంటే, అవి కూడా ఎమోషన్‌ను క్యారీ చెయ్యడమే. అధీర పాత్రధారి సంజయ్ దత్‌తో రాకీగా యశ్ చేసిన క్లైమాక్స్ ఫైట్ చూసి అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ అయ్యింది. అలాగే ప్రధాని రమికా సేన్ పాత్రను దర్శకుడు మలచిన విధానం, ఆ పాత్రలో రవీనా టాండన్ ప్రదర్శించిన అభినయం అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. క్లైమాక్స్ సీన్ చూసి ఆశ్చర్యపోనివాళ్లు ఉండరు. రాకీ లాంటి వీరుడికి తగ్గ క్లైమాక్స్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా టికెట్‌పై ప్రేక్షకుడు వెచ్చించిన ప్రతి పైసాకూ 'కేజీఎఫ్ చాప్టర్ 2' న్యాయం చేకూర్చిందనీ, ఇంకా చెప్పాలంటే పెట్టిన డబ్బులకు మించి వినోదాన్ని పంచిందనీ అందరూ అంగీకరిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2తో యశ్ పాన్ ఇండియా సూపర్‌స్టార్ కాగా, ప్రశాంత్ నీల్ దేశంలోని అగ్ర దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు.
![]() |
![]() |