![]() |
![]() |

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన 'కేజీఎఫ్ చాప్టర్-2' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాప్టర్-1 ని మించిన హీరో ఎలివేషన్స్ తో పాటు, మేకింగ్ పరంగా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉందంటూ ప్రశాంత్ నీల్ ని పొగిడేస్తున్నారు. 'కేజీఎఫ్-2' కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ సినిమా హీరో యశ్ ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతే హ్యాపీగా ఫీలవుతున్నారు.
'బాహుబలి'తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి ఇచ్చిన ఎనర్జీతోనే సౌత్ హీరోలు పాన్ ఇండియా సినిమాల బాట పట్టారు. అయితే ప్రభాస్ మాత్రం 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో అలరించలేకపోతున్నాడు. 'సాహో' నార్త్ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకోగా, 'రాధేశ్యామ్' మాత్రం అందరినీ నిరాశపరిచింది. దీంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న 'సలార్'పై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ ఇమేజ్ కి, కటౌట్ కి తగ్గట్లు ప్రశాంత్ నీల్ కరెక్ట్ గా చూపిస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. తాజాగా 'కేజీఎఫ్-2'తో ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ ప్రతిభ ఏంటో మరోసారి చూపించాడు. సలార్ లో ప్రభాస్ ని చాలా వయలెంట్ గా చూపించనున్నాడు. 'కేజీఎఫ్-2' స్థాయిలో సలార్ లో హీరో ఎలివేషన్స్ పడితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో విడుదల కానున్న సలార్ గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు 'కేజీఎఫ్-2'కి వస్తున్న రెస్పాన్స్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తారక్ తన తదుపరి సినిమాలను కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. గత 15-20 ఏళ్లుగా తాను తారక్ కి ఫ్యాన్ ని అని ఇటీవల ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఒక ఫ్యాన్ గా తారక్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడో అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
![]() |
![]() |