![]() |
![]() |

ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారం.. గ్లామర్ ప్రియులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ వారం రిలీజ్ కానున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఏకంగా నలుగురు స్టార్ హీరోయిన్స్ తమ గ్లామర్ తో కనువిందు చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ చిత్రం `కాత్తు వాక్కుల రెండు కాదల్`. ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా.. తెలుగులో `కణ్మణి రాంబో ఖతీజా` పేరుతో అదే రోజున రిలీజ్ కానుంది. కట్ చేస్తే.. ఆ తరువాతి రోజు అంటే ఏప్రిల్ 29న చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన మల్టిస్టారర్ మూవీ `ఆచార్య` తెరపైకి రాబోతోంది. ఇందులోనూ కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే వంటి స్టార్ బ్యూటీస్ నాయికలుగా నటించారు. సో.. ఏప్రిల్ చివరి వారంలో నయన తార, సమంత, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే వంటి అగ్ర కథానాయికల హవా ఉండబోతోందన్నమాట. మరి.. ఈ నలుగురు స్టార్ బ్యూటీస్ ఆయా చిత్రాల్లో ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
కాగా, `కణ్మణి రాంబో ఖతీజా`ని విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేయగా.. `ఆచార్య`ని కొరటాల శివ రూపొందించారు.
![]() |
![]() |