![]() |
![]() |
.webp)
తెలుగువారిని విశేషంగా అలరించిన జానపద చిత్రాల్లో `భైరవ ద్వీపం` ఒకటి. `ఆదిత్య 369` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ - అగ్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ముంగిట అఖండ విజయం సాధించడమే కాకుండా 9 విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకుని అప్పట్లో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ కి జోడీగా రోజా నటించిన ఈ సినిమాలో కేఆర్ విజయ, విజయ్ కుమార్, కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ రంగ రాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్, మిక్కిలినేని, సుత్తి వేలు, కోవై సరళ, వినోద్, పద్మనాభం ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. రంభ, రవళి ప్రత్యేక గీతాల్లో నృత్యాలతో కనువిందు చేశారు.
మాధవపెద్ది సురేశ్ సంగీతమందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``నరుడా ఓ నరుడా``, ``విరిసినది వసంత గానం``, ``శ్రీ తుంబుర నారద``, ``ఘాటైన ప్రేమ``, ``ఎంత ఎంత వింత మోహమో``, ``అమ్మా శాంభవి``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంది. చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకటరామిరెడ్డి నిర్మించిన `భైరవ ద్వీపం`.. 1994 ఏప్రిల్ 14న విడుదలై మ్యూజికల్ సెన్సేషన్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం 28 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |