![]() |
![]() |

'కేజీఎఫ్ చాప్టర్-2' ప్రభంజనానికి రంగం సిద్ధమైంది. 'కేజీఎఫ్-1' సృష్టించిన సంచలనాలతో భారీ అంచనాల నడుమ 'కేజీఎఫ్-2' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పేరుకి కన్నడ మూవీ అయినప్పటికీ ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మొదటి రోజు ఈ సినిమాకి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రానున్నాయి.
'కేజీఎఫ్-2'కి తెలుగు, హిందీలో మొదటి రోజు కర్ణాటకకు మించిన కలెక్షన్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ డే ఈ మూవీ కర్ణాటకలో రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో 30-35 కోట్ల గ్రాస్, నార్త్ లో 55-60 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని అంటున్నారు. తమిళనాడులో 10 కోట్లు, కేరళ 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా ఇండియాలో ఫస్ట్ డే దాదాపు 140 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఓవర్సీస్ లో మొదటి రోజు 25-30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశమున్న 'కేజీఎఫ్-2'.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 165 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
'కేజీఎఫ్-2'కి భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ 'ఆర్ఆర్ఆర్' డే-1 రికార్డుని బీట్ చేయడం కష్టమేనని అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఒక్క తెలుగులోనే మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలో ఫస్ట్ డే 30 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయినప్పటికీ.. ఓవర్సీస్ లో 69 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.
![]() |
![]() |