![]() |
![]() |

అర్జున్, మధుబాల జంటగా శంకర్ రూపొందించిన జెంటిల్‌మేన్ (1993) మూవీ తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ మూవీని నిర్మించిన కె.టి. కుంజుమోన్.. ఇప్పుడు దానికి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌కు డైరెక్టర్ ఎవరనేది ఇంతదాకా ప్రకటించని ఆయన.. హీరోయిన్లను ఎంపిక చేశారు. ఇదివరకే ఓ హీరోయిన్‌గా నయనతార చక్రవర్తిని ఎంపిక చేసిన కుంజుమోన్, ఈరోజు మరో నాయికను ప్రకటించారు.
తెలుగులో గువ్వా గోరింక చిత్రంతో పరిచయమైన ప్రియా లాల్‌ను జెంటిల్‌మేన్ 2లో రెండో నాయికగా ఎంపిక చేసినట్లు కుంజుమోన్ నేడు ప్రకటించారు. ఈ క్రేజీ ఫిల్మ్‌కు ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనేది ఇప్పుడు అందరిలోనూ క్యూరియాసిటీ రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

![]() |
![]() |