![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా రికార్డు వ్యూస్, లైక్స్ తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఎన్ని రికార్డ్స్ చేసినా ఈ మూవీ ట్రైలర్ పట్ల మెగా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది.
తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో పాటు.. 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలన విజయం తర్వాత వస్తున్న చరణ్ నటించిన సినిమా కావడంతో 'ఆచార్య'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అంచనాలకు తగ్గ స్థాయిలో ఆచార్య ట్రైలర్ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రైలర్ కట్ సరిగా లేదని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా లేవని అంటున్నారు. ట్రైలర్ లో ఎక్కువశాతం ఒకే లొకేషన్ చూపించారని, రెండున్నర నిమిషాల ట్రైలర్ లో చిరంజీవిని ఒక నిమిషమే చూపించారని, అది కూడా ఎక్కువ యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ట్రైలర్ ఊహించిన స్థాయిలో లేదని మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ గా కొరటాల శివ కెరీర్ లో ఇప్పటిదాకా ప్లాప్ లేదు. ఇప్పటిదాకా ఆయన డైరెక్షన్లో వచ్చిన 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతాగ్యారేజ్', 'భరత్ అనే నేను' సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో వస్తున్న ఐదో సినిమా 'ఆచార్య' కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ట్రైలర్ కట్ కాస్త డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ, సినిమా మాత్రం మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. మరి ఆచార్యతో ఐదో హిట్ ని కొరటాల తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |