![]() |
![]() |

తెలుగు చిత్ర పరిశ్రమతో నటి నదియాకి 30 ఏళ్ళకు పైగా అనుబంధం ఉంది. `బజార్ రౌడీ`, `వింత దొంగలు`, `ఓ తండ్రి ఓ కొడుకు` వంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన నదియా.. ఆపై `మిర్చి`, `అత్తారింటికి దారేది`, `దృశ్యం`, `బ్రూస్ లీ`, `అ ఆ`, `నా పేరు సూర్య`, `మిస్ ఇండియా`, `వరుడు కావలెను`, `దృశ్యం 2`, `గని` సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ దర్శనమిచ్చింది. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతీ చిత్రంలోనూ నటిగా తనదైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రంలోనూ తన సొంత గొంతుతో పలకరించని నదియా.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి డబ్బింగ్ చెప్పుకుందట. ఆ వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని, కేరళకుట్టి నజ్రీయా జంటగా `అంటే.. సుందరానికీ!` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. కాగా, ఇందులోని తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుందట నదియా. మరి.. టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ తన ఓన్ వాయిస్ తో ఎంటర్టైన్ చేయనున్న నదియా.. ఏ స్థాయిలో సొంత పలుకులతో మురిపిస్తుందో చూడాలి.
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న `అంటే.. సుందరానికీ!` జూన్ 10న జనం ముందుకు రానుంది.
![]() |
![]() |