![]() |
![]() |
.webp)
కథానాయికగా సోనాల్ చౌహాన్ ది 14 ఏళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ అంటూ పలు భాషల్లో నటిగా సందడి చేసింది సోనాల్. అయితే, ఆమె తొలి చిత్రం `జన్నత్` (హిందీ)తో పాటు `లెజెండ్` (తెలుగు) మాత్రమే తనకి కమర్షియల్ హిట్స్ అందించడం గమనార్హం.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సోనాల్ చేతిలో మూడు ఆసక్తికరమైన చిత్రాలున్నాయి. ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన `ఎఫ్ 3`లో ఓ కీలక పాత్రలో కనిపించనున్న సోనాల్ చౌహాన్.. ఆపై కింగ్ నాగార్జునకి జోడీగా `ద ఘోస్ట్` సినిమాలో ఎంటర్టైన్ చేయనుంది. అంతేకాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`లోనూ సోనాల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. కాగా, మే 27న `ఎఫ్ 3` రిలీజ్ కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 12న `ఆదిపురుష్` విడుదల కానుంది. ఈ రెండు సినిమాల నడుమ `ద ఘోస్ట్` తెరపైకి వచ్చే అవకాశముంది. మరి.. ఏడాది లోపే రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో సోనాల్ చౌహాన్ ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |