![]() |
![]() |

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్సే'. గోపి గణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
సత్యదేవ్, గోపి గణేష్ కాంబినేషన్ లో గతంలో 'బ్లఫ్ మాస్టర్' మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరు కాంబినేషన్ లో 'గాడ్సే' వస్తుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని మే 20 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ని వదిలారు. అందులో రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని సత్యదేవ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

ఇటీవల 'స్కైలాబ్'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సత్యదేవ్.. హీరోగా 'గాడ్సే'తో పాటు 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో నటించాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్'లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ యంగ్ హీరో.. 'రామ్ సేతు' అనే హిందీలో మూవీలోనూ నటిస్తుండటం విశేషం.
![]() |
![]() |