![]() |
![]() |

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కేజీఎఫ్-2'. 'కేజీఎఫ్-1'కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 14 న విడుదలవుతున్న ఈ సినిమా కోసం కన్నడ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్-2' ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది.
తెలుగులో అత్యధిక బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాల్లో రజినీకాంత్ హీరోగా నటించిన 'రోబో 2.O' ఇప్పటిదాకా టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ.71 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాతి ప్లేస్ లో 39 కోట్లతో విక్రమ్ హీరోగా నటించిన 'ఐ(మనోహరుడు)' ఉంది. ఈ రెండు సినిమాలకి శంకరే దర్శకుడు కావడం విశేషం. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలూ తెలుగులో బయ్యర్లకు నష్టాలను మిగిల్చాయి. ఇదిలా ఉంటే బిజినెస్ పరంగా '2.O' పేరిట ఉన్న రికార్డుని ఇప్పుడు 'కేజీఎఫ్-2' బ్రేక్ చేసింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల బిజినెస్ చేసింది.
నైజాంలో 25 కోట్ల బిజినెస్ చేసిన కేజీఎఫ్-2 .. సీడెడ్ లో 14 కోట్లు, ఆంధ్రాలో 39కోట్లు(ఉత్తరాంధ్ర 10 కోట్లు, ఈస్ట్ 7 కోట్లు, వెస్ట్ 6 కోట్లు, గుంటూరు 7 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 3 కోట్లు) బిజినెస్ చేసింది. ఓ డబ్బింగ్ సినిమాకి టాలీవుడ్ స్టార్ హీరో మూవీ రేంజ్ లో బిజినెస్ జరగడం సంచలనంగా మారింది. 'కేజీఎఫ్-1'కి వచ్చిన రెస్పాన్సే ఈ స్థాయి బిజినెస్ జరగడానికి కారణమని చెప్పొచ్చు. మరి 'కేజీఎఫ్-2' తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |