![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 153వ సినిమా 'గాడ్‌ఫాదర్' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రను చేస్తున్నాడు. ఈరోజు (శనివారం) ఆయన చిరంజీవితో కలిసి షూటింగ్లో పాల్గొన్నాడు. జైలులో ఖైదీగా ఉన్న చిరంజీవితో పాటు జగన్‌పై కొన్ని సన్నివేశాల్ని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.
సెట్స్ మీదకు పూరి జగన్నాథ్‌ను తను బొకేతో ఆహ్వానిస్తున్న ఫొటోలను చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే introducing my @purijagan in a special role, from the sets of #Godfather.” అని ఆయన రాసుకొచ్చారు. పూరితో పాటు ఆయన బిజినెస్ పార్టనర్ చార్మి సైతం గాడ్‌ఫాదర్ సెట్స్‌కు వెళ్లారు.
పూరికి ఇది కల నిజమవడం లాంటి సందర్భం అని చెప్పుకోవచ్చు. ఆయనకు చిరుకు వీరాభిమాని మరి. ఇంతదాకా చిరును డైరెక్ట్ చేసే చాన్స్ రాకపోయినా, ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం దక్కింది.

మోహన్‌లాల్ టైటిల్ రోల్ చేయగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మలయాళం మూవీ 'లూసిఫర్'కు రీమేక్ అయిన 'గాడ్‌ఫాదర్'లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
![]() |
![]() |