![]() |
![]() |

సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఎం. బాలయ్య శనివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఇదే రోజు ఆయన జన్మదినం కూడా కావడం గమనార్హం. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. కెరీర్ ఆరంభంలో హీరోగానూ పలు చిత్రాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. పౌరాణిక, జానపద చిత్రాల్లోనూ ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. 'పాండవ వనవాసం'లో అర్జునుడిగా నటించారు.
మనోరమ (59), తల్లీబిడ్డలు (63), అన్నదమ్ముల కథ (75), ప్రేమ పగ (78) తదితర చిత్రాల్లో కథానాయకుడి పాత్రలు చేశారు.
కుమారుడు తులసీరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'పసుపుతాడు' (1986) చిత్రాన్ని ఆయన డైరెక్టర్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఊరుకిచ్చిన మాట (81), నిజం చెబితే నేరమా (83), మహామనిషి (85), పోలీస్ అల్లుడు (94) లాంటి సినిమాలు ఉన్నాయి.
అలాగే అమృత ఫిలిమ్స్ బ్యానర్‌పై పలు మంచి చిత్రాలను ఆయన నిర్మించారు వాటిలో కె. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన 'చెల్లెలి కాపురం', 'నేరము శిక్ష' లాంటి చిత్రాలతో పాటు 'చుట్టాలున్నారు జాగ్రత్త' (80) వంటివి ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన, నిర్మించిన చిత్రాల్లో ఎక్కువగా సూపర్‌స్టార్ కృష్ణ నటించారు.
![]() |
![]() |