![]() |
![]() |

అమేజింగ్ సినిమాటోగ్రఫీ, ఒళ్లు జలదరింపజేసే యాక్షన్ సీక్వెన్స్‌లు, ఊహాతీతంగా సాగే డైరెక్షన్‌తో 'కేజీఎఫ్ చాప్టర్ 2' ట్రైలర్ మాస్‌లో రేకెత్తిస్తోన్న అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. రాకింగ్ స్టార్ యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, నిధి శెట్టి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని వేరే లెవల్‌కు తీసుకు వెళ్తాయని ట్రేట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యశ్ చెప్తోన్న డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అందర్నీ ఎగ్జయిట్‌మెంట్‌కు గురిచేస్తోన్న విషయం క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది.
పాన్ ఇండియా లెవల్లో 'కేజీఎఫ్ 2'కు వచ్చిన అసాధారణ క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తోందనే అమితాసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 'కేజీఎఫ్ 1'తో పోలిస్తే చాప్టర్ 2 కలెక్షన్లు మరింత అసాధారణంగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క హిందీ వెర్షనే మొదటి రోజు రూ. 30 కోట్ల నుంచి 33 కోట్ల (నెట్) వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ వెర్షన్లు కలుపుకొని దేశవ్యాప్తంగా చాప్టర్ 2 రూ. 90 కోట్ల గ్రాస్‌ను సాధించే అవకాశం ఉంది.
ఉద్వేగభరితమైన కథనం, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులు, అలరించే పాటలు, ఆకట్టుకొనే అభినయాలతో 'కేజీఎఫ్' చాప్టర్ 1 దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దాంతో ఏప్రిల్ 14న విడుదల కానున్న చాప్టర్ 2పై విపరీతమైన ఆసక్తీ, అంచనాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాకీగా యశ్, అధీరగా సంజయ్ దత్ ఒకరితో ఒకరు అత్యంత శక్తిమంతంగా ఢీకొట్టే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, రవీనా టాండన్ ప్రధానమంత్రిగా నటించారు.
![]() |
![]() |