![]() |
![]() |

మంచు విష్ణు హీరోగా 'గాలి నాగేశ్వరరావు' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రేణుక అనే పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో విష్ణుని ఆటపట్టించాలని సన్నీ ప్రయత్నించగా.. రివర్స్ లో విష్ణునే ఆమెను ఆడుకున్నాడు.
'గాలి నాగేశ్వరరావు' షూటింగ్ లో విష్ణు, సన్నీ పాల్గొంటున్నారు. అయితే షూట్ బ్రేక్ లో జరిగిన ఓ సరదా ఇన్సిడెంట్ ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంది సన్నీ. ఫేస్ కి జోకర్ మాస్క్ పెట్టుకొని, గోడ వెనుక దాక్కొని అటుగా వెళ్తున్న విష్ణుని భయపెట్టడానికి సన్నీ ట్రై చేస్తుంది. అయితే విష్ణు దానికి భయపడకపోగా.. ఆమె మాస్క్ తీసేసిన తర్వాత ఆమె రియల్ ఫేస్ ని చూసి భయపడినట్లు గట్టిగా అరుస్తూ పరుగెడతాడు. తాను చేసిన ప్రాంక్ తనకే రివర్స్ అవ్వడంతో సన్నీ విష్ణుని తరుముతుంది.
ఈ సరదా వీడియోని సన్నీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |