![]() |
![]() |

`వినయ విధేయ రామ` (2019)తో ట్రాక్ తప్పిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి.. రీసెంట్ గా రిలీజైన పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` ఘనవిజయం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ పిరియడ్ డ్రామాతో దేశవ్యాప్తంగా కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపుని పొందాడు చరణ్. ఈ నేపథ్యంలో.. రామ్ చరణ్ తాజా చిత్రం `ఆచార్య`పై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ నటించిన ఈ సోషల్ డ్రామా.. వేసవి కానుకగా ఈ నెల 29న జనం ముందుకు రాబోతోంది. చిరు టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. సిద్ధగా స్పెషల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నాడు రామ్ చరణ్.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు సమ్మర్ సీజన్ లో రిలీజైన రామ్ చరణ్ చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి. `రచ్చ` (2012), `రంగస్థలం` (2018), `ఆర్ ఆర్ ఆర్` (2022).. ఇలా ఇప్పటికే వేసవిలో ముచ్చటగా మూడు కమర్షియల్ హిట్స్ ని సొంతం చేసుకున్న ఈ కొణిదెల స్టార్.. `ఆచార్య`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
కాగా, `ఆచార్య`కి విజనరీ కెప్టెన్ కొరటాల శివ దర్శకత్వం వహించగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందించారు. ఇందులో చిరుకి జంటగా కాజల్ అగర్వాల్ దర్శనమివ్వనుండగా.. చరణ్ కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది.
![]() |
![]() |