![]() |
![]() |
.webp)
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌లో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పబ్ ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించిన పోలీసులు పబ్ యజమానితో పాటు.. ఆ సమయంలో రేవ్ పార్టీలో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిలో మెగా డాటర్ నిహారికతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల కుటుంబాలకు చెందిన పలువురు ఉన్నారు. అయితే ఈ పార్టీలో కొందరు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ కేసులో నిహారిక అంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో నిహారిక తండ్రి మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన కూతురు నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని నాగబాబు అన్నారు.
పబ్ లో నిహారిక ఉండడం వల్లే తాను మాట్లాడాల్సి వస్తోందని నాగబాబు వెల్లడించారు. నిర్ణీత సమయాన్ని మించి రన్ చేసిన కారణంగా పోలీసులు పబ్ పై చర్యలు తీసుకున్నారని తెలిపారు. తన కుమార్తె నిహారిక విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, అంతా క్లియర్ అని స్పష్టం చేశారు. పోలీసులు తమకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదని చెప్పినట్లు నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. సోషల్ మీడియా, మీడియాలో ఊహాగానాలకు తావివ్వరాదన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇవ్వాల్సి వస్తోందని నాగబాబు అన్నారు.
![]() |
![]() |