![]() |
![]() |

ఉగాది రోజు ఆర్ఆర్ఆర్ ప్రభంజనం రెట్టింపు అయింది. కొన్ని చోట్ల ఫస్ట్ డే రేంజ్ లో కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. నైజాం(తెలంగాణ)లో అయితే ఆర్ఆర్ఆర్ దూకుడు అంచనాలకు మించి ఉంది. ఇప్పటికే రూ.90 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన మూవీ నేడో రేపో 100 కోట్ల మార్క్ అందుకోనుంది.
నైజాంలో రూ.70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ ఆరు రోజుల్లోనే 73.15 కోట్ల షేర్ రాబట్టి ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఏడో రోజు 4.07 కోట్లు, ఎనిమిదో రోజు 4.31 కోట్లు కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ తొమ్మిదో రోజు శనివారం మరియు ఉగాది కావడంతో 8.57 కోట్లతో సత్తా చాటింది. తొమ్మిది రోజుల్లో 90.10 కోట్ల షేర్ రాబట్టి నైజాంలో 90 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆదివారం లేదా సోమవారం వంద కోట్ల మార్క్ అందుకోనున్న ఈ మూవీ.. ఓవరాల్ గా నైజాంలో 120 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముందని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ తో దిల్ రాజు పంట పండినట్లే. 'రాధేశ్యామ్' మూవీని నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో రిలీజ్ లో చేసిన దిల్ రాజు.. దాదాపు 20 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో ఒక్క నైజాంలోనే 20 కోట్ల లాభాలు తెచ్చుకుని రాధేశ్యామ్ నష్టాన్ని భర్తీ చేసుకున్నాడు. అంతేకాదు ఫుల్ రన్ లో మరో 20 కోట్లు లాభాలు పొందే అవకాశముంది.
![]() |
![]() |