![]() |
![]() |

టాలీవుడ్ లో మెగాస్టార్ గా చాలా ఏళ్ల పాటు టాప్ పొజిషన్ లో ఉన్న చిరంజీవి.. పాలిటిక్స్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. పాలిటిక్స్ లోకి వెళ్లి తప్పు చేశానన్న అభిప్రాయాన్ని అప్పుడప్పుడు తన మాటల ద్వారా వ్యక్తపరిచే చిరంజీవి.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్'. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమాకి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ దర్శకుడు. ఏప్రిల్ 1 న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరగగా ఈ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఝుమ్మంది నాదం సినిమా టైంలో తాప్సీని చూసి క్యూట్ గర్ల్ అనుకున్నాను. ఆమె ఇప్పుడు ఇంత పవర్ ఫుల్ యాక్ట్రెస్ గా మారింది. ఝుమ్మంది నాదం టైంలోనే తాప్సీని చూసి ఎంత బాగుంది, ఎంత యాక్టివ్ గా ఉంది అనుకున్నాను.. కానీ అప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్లడంతో తనతో సినిమా చేయలేకపోయాను. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే నేను ఎందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళానా అని ఫీల్ అవుతాను. ఇప్పటికైనా నిరంజన్ రెడ్డి.. తనని, తాప్సీని పెట్టి సినిమా తీస్తే బాగుంటుంది. ఇప్పటి కుర్ర హీరోలలో ఎవరిని సెలెక్ట్ చేసినా ఓకే" అని చెప్పుకొచ్చారు.
![]() |
![]() |