![]() |
![]() |

`బిల్లా` (2009), `మిర్చి` (2013), `బాహుబలి - ది కంక్లూజన్` (2017) చిత్రాల్లో జంటగా అలరించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ బ్యూటీ అనుష్క. కట్ చేస్తే.. ఐదేళ్ళ గ్యాప్ తరువాత ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ వేసవిలోనే పట్టాలెక్కనుందని సమాచారం. కాగా, ముగ్గురు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా అనుష్కని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బజ్. త్వరలోనే ప్రభాస్ - మారుతి కాంబో ఫిల్మ్ లో స్వీటీ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ - అనుష్క జోడీ మరోసారి మెస్మరైజ్ చేస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, అనుష్క ప్రస్తుతం `జాతిరత్నాలు` ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఆసక్తికరమైన చిత్రం.. ఇదే క్యాలెండర్ ఇయర్ లో రిలీజ్ అయ్యే అవకాశముంది. మరోవైపు.. ప్రభాస్ చేతిలో `సలార్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్` చిత్రాలున్నాయి.
![]() |
![]() |