![]() |
![]() |

ఎన్నో అంచనాల మధ్య మార్చి 11 న థియేటర్స్ లో విడుదలైన 'రాధేశ్యామ్' డివైడ్ టాక్ తెచ్చుకొని బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాధేశ్యామ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
'రాధేశ్యామ్' థియేటర్స్ లో విడుదలైన మరుసటి రోజు నుంచి మూడు వారాల తర్వాత ఉగాదికి(ఏప్రిల్ 2) ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఒకరోజు ముందుగానే ఏప్రిల్ 1 నుంచి ఓటీటీలో అలరించనుంది. గతేడాది డిసెంబర్ 17 న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'పుష్ప ది రైజ్' నాలుగు వారాలకే జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు రాధేశ్యామ్ మూడు వారాలకే ఓటీటీలోకి వస్తుండటం విశేషం. దీంతో రీసెంట్ గా ఈ సినిమాని థియేటర్స్ లో చూసిన వాళ్ళు.. వారం ఆగి ఉంటే డబ్బులు మిగిలేవి కదా అని ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్'కి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది.
![]() |
![]() |