![]() |
![]() |
.webp)
ఇటీవల 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామునిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ కి సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
'ఆదిపురుష్' షూటింగ్ గతేడాది నవంబర్ లోనే పూర్తయింది. షూటింగ్ అయిపోయి నాలుగు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఈ మూవీ నుంచి అధికారిక పోస్టర్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. శ్రీరాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఖరారైందట. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 10 న 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాని టి-సిరీస్, రెట్రోఫిలిస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దేశంలోని అత్యధిక బడ్జెట్‌తో తయారైన సినిమాల్లో ఒకటిగా రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తయారవుతోంది. ఈ మైథలాజికల్ మూవీలో సీత పాత్రలో కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
![]() |
![]() |