![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్' మూవీ తెలుగునాట కలెక్షన్ల సునామీతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజు రూ. 33.53 కోట్ల షేర్‌ను వసూలుచేసి రికార్డులను తొక్కుకుంటూ పోతోంది. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా శుక్రవారం రూ. 74.11 కోట్లు, రెండో రోజు రూ. 31.63 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. వెరసి.. మూడు రోజుల్లో ఈ ఫిల్మ్ తెలుగునాట వసూలు చేసిన మొత్తం రూ. 139.27 కోట్ల షేర్‌కు చేరుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్' ప్రి బిజినెస్ విలువ రూ. 191 కోట్లని అంచనా. అంటే మూడు రోజులకే 72.91 శాతం రికవరీ సాధించిందన్న మాట. తొలి మూడు రోజుల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయనేది నిజం. పెంచిన టికెట్ ధరలను సోమవారం హైదరాబాద్‌లో తగ్గించారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో టికెట్ ధరలు మామూలు స్థితికి వచ్చాయి. అందుకు అనుగుణంగా కలెక్షన్లు కూడా తగ్గనున్నాయి. అయితే టికెట్ సేల్స్ ఆశాజనకంగానే ఉన్నందున సోమవారం తెలుగునాట రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల మధ్య వసూళ్లు ఉండవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మూడో రోజు తెలంగాణలో రూ. 15.05 కోట్లు, ఆంధ్రాలో రూ. 12.08 కోట్లు, రాయలసీమలో రూ. 6.40 కోట్ల షేర్‌ను 'ఆర్ఆర్ఆర్' రాబట్టింది. మౌత్ టాక్ కారణంగా ఈ సినిమాని చూడ్డానికి జనం విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో సునాయాసంగా ఈ సినిమా బ్రేకీవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |