![]() |
![]() |

`ఇద్దరమ్మాయిలతో`, `రుద్రమదేవి`, `సరైనోడు` చిత్రాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంటగా నటించి అలరించింది హాట్ బ్యూటీ కేథరిన్ ట్రెసా. ఆ సినిమాలకి ముందు, తరువాత వేరే హీరోలతోనూ జోడీకట్టినా.. బన్నీ హీరోయిన్ గానే తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్. కాగా, `వరల్డ్ ఫేమస్ లవర్` (2020) తరువాత మళ్ళీ టాలీవుడ్ లో కనిపించని కేథరిన్.. ప్రస్తుతం `బింబిసార`, `భళా తందనాన`, `మాచర్ల నియోజకవర్గం` వంటి చిత్రాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. బాబీ దర్శకత్వంలో `మెగా 154` అనే వర్కింగ్ టైటిల్ తో చిరు ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ మెయిన్ లీడ్ గా కనిపించనుండగా.. కేథరిన్ కూడా సందడి చేయనుందట. అయితే, చిరంజీవికి జోడీగా కాకుండా.. స్పెషల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్న మాస్ మహారాజా రవితేజకి జంటగా కేథరిన్ దర్శనమివ్వనుందట. ఇంతకుముందు ఇదే పాత్రకి నివేదా పెతురాజ్ పేరు కూడా వినిపించింది. త్వరలోనే `మెగా 154`లో కేథరిన్ ట్రెసా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |