![]() |
![]() |

మొన్నటిదాకా ఇప్పట్లో 'బాహుబలి-2' రికార్డులు బ్రేక్ అవ్వడం కష్టమేనన్న అభిప్రాయం ఉండేది. అయితే రాజమౌళి తన తదుపరి సినిమాతోనే ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25 న విడుదలై 'బాహుబలి-2' రికార్డులు బ్రేక్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ కి చేరువై అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
తెలుగురాష్ట్రాల్లో మొదటి రోజు 74.11 కోట్ల షేర్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ రెండో రోజు, మూడో రోజు కూడా రికార్డు స్థాయిలో షేర్ కలెక్ట్ చేసింది. రెండో రోజు 31.63 కోట్లు, మూడో రోజు 33.53 కోట్లు రాబట్టి.. ఇప్పటిదాకా 139.27 కోట్ల షేర్ తో సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి-2' మూడు రోజుల్లో 74.40 కోట్ల షేర్, మొత్తంగా 204 కోట్లు షేర్ కలెక్ట్ చేయగా.. ఆర్ఆర్ఆర్ కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 140 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ అప్పుడే 53.50 కోట్లు రాబట్టింది. అలాగే సీడెడ్ లో 28.90 కోట్లు(బిజినెస్ 37 కోట్లు), ఆంధ్రాలో 56.84 కోట్లు(బిజినెస్ 84 కోట్లు)తో సత్తా చాటింది.
వరల్డ్ వైడ్ గా మొదటిరోజు 135 కోట్లు, రెండో రోజు 67.44 కోట్లు, మూడో 78.73 కోట్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్ మూడోరోజుల్లో 281.17 కోట్ల షేర్(496 కోట్ల గ్రాస్)తో సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో 59.10 కోట్లు, హిందీ 36.80 కోట్లు, కర్ణాటక 20.50 కోట్లు, తమిళనాడు 16.20 కోట్లు, కేరళ 5.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 4.05 కోట్లతో అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఆర్ఆర్ఆర్ మరో 171.83 కోట్లు రాబడితే క్లీన్ హిట్ గా నిలవనుంది. వీక్ డేస్ లోనూ ఇదే జోరు కొనసాగితే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటడానికి ఎన్నో రోజులు పట్టదు.
![]() |
![]() |