Home  »  News  »  ఆస్కార్‌ వేడుకల్లో షాకింగ్‌ ఘటన.. హోస్ట్ ని కొట్టిన విల్‌ స్మిత్‌

Updated : Mar 28, 2022

ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. 94వ ఆస్కార్‌ వేడుకల్లోభాగంగా ‘కింగ్‌ రిచర్డ్‌’ సినిమాకుగానూ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్న విల్‌ స్మిత్‌.. హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించాడు. 

స్టేజ్‌ పై ఉన్న క్రిస్‌ ఆడియన్స్ ని నవ్వించే క్రమంలో విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌ మీద ఓ జోక్‌ పేల్చాడు. అదే విల్‌ స్మిత్‌ కోపానికి కారణమైంది. 'అలోపేసియా' అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమెకి జుట్టు ఊడిపోవడంతో గుండుతో ఈ వేడుకకి హాజరైంది. ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె ఇటీవల చెప్పింది కూడా. అయితే క్రిస్‌ మాత్రం ఆమె లుక్ పై జోకులేశాడు. ఆమె 'జీ.ఐ జేన్' మూవీలో 'డెమి మూర్'లా ఉందని అన్నాడు. ఆ సినిమాలో డెమి పూర్తి గుండుతో కనిపిస్తుంది. దీంతో పింకెట్‌ ఆ మూవీ సీక్వెల్ లో ఏమైనా నటిస్తుందా అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్‌ స్మిత్‌.. ఒక్కసారిగా స్టేజ్‌ మీదకు సీరియస్‌గా నడుచుకుంటూ వెళ్లి క్రిస్‌ దవడ పగలకొట్టాడు. ఆ వెంటనే మళ్ళీ స్టేజ్ దిగొచ్చి తన కుర్చీలో కూర్చున్న స్మిత్ ఇంకోసారి తన భార్య గురించి కామెంట్ చేయొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

ఆ తర్వాత కాసేపటికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోడానికి స్టేజ్ ఎక్కిన స్మిత్‌.. తను అందుకున్న మొదటి ఆస్కార్ కావడంతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే క్రిస్ ఘటనపై స్పందిస్తూ అందరికీ క్షమాపణలు చెప్పాడు. మరోవైపు క్రిస్‌ కూడా స్మిత్ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.