![]() |
![]() |

'గని', 'ఎఫ్3' సినిమాలతో త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైన వరుణ్ తేజ్.. తాజాగా మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.
వరుణ్ తేజ్- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమా రానుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. 'పీఎస్వీ గరుడవేగ' సినిమాతో మెప్పించిన ప్రవీణ్ ఆ తర్వాత వరుణ్ ని డైరెక్ట్ చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ప్రవీణ్.. నాగార్జున హీరోగా 'ది ఘోస్ట్' అనే సినిమా తెరకెక్కిస్తూ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ జరుగుతుండగానే వరుణ్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు. సోమవారం ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మెగా బ్రదర్ నాగబాబు క్లాప్ కొట్టాడు. వరుణ్ కెరీర్ లో 12 వ సినిమాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది.

కాగా, వరుణ్ ఏప్రిల్, మేలో వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. ఏప్రిల్ 8 న గని, మే 27 న ఎఫ్-3 విడుదల కానున్నాయి.
![]() |
![]() |