![]() |
![]() |

ప్రజెంట్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి 2001 లో వచ్చిన 'స్టూడెంట్ నెం.1' సినిమాతో సినీ డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత 'బాహుబలి-2' వరకు మొత్తం 11 సినిమాలు చేసిన ఆయన అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో నాలుగో హ్యాట్రిక్ కి రెడీ అయ్యాడు. అయితే డైరెక్టర్ గా నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి.. అప్పట్లో తాను నటించిన ఒక సినిమా విడుదలై ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదేమో అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
రాజమౌళిలో మంచి నటుడు ఉన్నాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో మెరిసే రాజమౌళి.. తన సినిమాల్లో నటించే యాక్టర్స్ కి ఒక్కోసారి ఆ సీన్ ఎలా చేయాలో తనే నటించి చూపిస్తూ ఉంటాడు. నిజానికి రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరపై అడుగు పెట్టాల్సి ఉంది. కానీ అదృష్టం కొద్దీ ఆ సినిమా రిలీజ్ కాకపోవడంతో.. ఇప్పుడు డైరెక్టర్ గా ఈ స్థాయిలో ఉన్నాడు. తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయాన్ని రీసెంట్ గా రాజమౌళి రివీల్ చేశాడు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి ఒక సీక్రెట్ బయటపెట్టాడు. "1983లో 'పిల్లన గ్రోవి' అనే సినిమాలో బాల నటుడిగా నటించాను. అప్పుడు నా వయసు పదేళ్లు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. ఒకవేళ ఆ సినిమా విడుదలై పేరొచ్చి ఉంటే, నా కెరీర్ మరోలా ఉండేదేమో" అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 'పిల్లన గ్రోవి'లో రాజమౌళి బాల కృష్ణుడిగా నటించాడు. ఆ సినిమా రిలీజ్ కాకపోవడమే మంచి అయిందని.. ఒకవేళ విడుదలై రాజమౌళి అలాగే యాక్టర్ గా కంటిన్యూ అయ్యుంటే ఇంత మంచి డైరెక్టర్ ని మిస్ అయ్యేవాళ్ళమని ఫ్యాన్స్ అంటున్నారు.
![]() |
![]() |