![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సల్మాన్.. ఇన్నేళ్ల కెరీర్ లో మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అదే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'గాడ్‌ఫాదర్' మూవీ. ఈ మూవీలో సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మలయాళం బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్‌ఫాదర్'లో.. ఒరిజినల్‌లో మోహన్‌లాల్ చేసిన టైటిల్ రోల్‌ను తెలుగు రీమేక్‌లో చిరంజీవి చేస్తున్నాడు. అలాగే ఒరిజినల్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన స్పెషల్ క్యారెక్టర్‌ను సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా సెట్స్ లో సల్మాన్ ని తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూవీలో సల్మాన్ లుక్ ఎలా ఉండబోతుందో ఆ ఫోటోలలో రివీల్ అయింది. సల్మాన్ లుక్ ఆకట్టుకుంటోంది. నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గాడ్‌ఫాదర్'లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై సురేఖ సమర్పిస్తోన్న ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
![]() |
![]() |