![]() |
![]() |

నిజజీవిత ప్రేమికులు ఆలియా భట్, రణబీర్ కపూర్ వారణాసిలో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర' చివరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వారణాసిలోని అందమైన లొకేషన్లలో ఆ ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఫ్యాన్స్ షేర్ చేసిన ఓ వీడియోలో ఒక బోట్‌లో సీన్ చేస్తున్నప్పుడు ఆలియా 'ఆర్ఆర్ఆర్' మూవీని ప్రమోట్ చేస్తూ కనిపించింది.
అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 25న విడుదలవుతోంది. అందులో అజయ్ దేవ్‌గణ్ ఓ స్పెషల్ రోల్ చేయగా, రామ్‌చరణ్ జోడీగా ఆలియా భట్ నటించింది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించారు.
ఇప్పుడు లేటేస్ట్ వీడియోలో ఆలియా, రణబీర్ 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ నిమిత్తం ఓ బోట్‌లో నిల్చొని కనిపిస్తున్నారు. నది ఒడ్డున నిల్చొని షూటింగ్ తిలకిస్తున్న ఫ్యాన్స్ 'ఆర్ఆర్ఆర్' అంటూ కేకలు వేయగా, అందుకు స్పందనగా ఆలియా సైతం 'ఆర్ఆర్ఆర్' అంటూ జత కలిపింది.
'ఆర్ఆర్ఆర్' మూవీతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది ఆలియా. ఇందులో సీత పాత్రలో ఆమె కనిపించనుంది. రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఇద్దరు వీరులు.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లతో కల్పిత కథను అల్లి తీసిన ఈ సినిమాపై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. 'బాహుబలి 2' రికార్డులను కూడా ఈ సినిమా చెరిపి వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |