![]() |
![]() |

కొణిదెల కాంపౌండ్ లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జట్టుకట్టిన చెన్నై పొన్ను శ్రుతి హాసన్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కి జంటగా ఓ సినిమా చేస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ భారీ బడ్జెట్ మూవీకి బాణీలు అందిస్తున్నాడు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కొణిదెల కాంపౌండ్ స్టార్స్ తో శ్రుతి హాసన్ తొలిసారిగా జోడీకట్టిన మూడు సందర్భాల్లోనూ ఓ ఫ్యాక్టర్ రిపీట్ అవుతోంది. ఇంతకీ అదేమిటంటే.. `దేవి శ్రీ ప్రసాద్` మ్యూజిక్. ఆ వివరాల్లోకి వెళితే.. పవన్ తో ఫస్ట్ టైమ్ శ్రుతి రొమాన్స్ చేసిన `గబ్బర్ సింగ్`(2012)కి డీఎస్పీ స్వరాలు సమకూర్చగా.. చరణ్ తో మొదటిసారి శ్రుతి ఆడిపాడిన `ఎవడు`(2014)కి కూడా దేవి శ్రీనే స్వరకర్త. కట్ చేస్తే.. ఇప్పుడు చిరుతో శ్రుతి హాసన్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సందర్భంలోనూ దేవి శ్రీ ప్రసాద్ నే సంగీతమందిస్తున్నాడు. మొత్తమ్మీద.. కొణిదెల కాంపౌండ్ స్టార్స్ తో శ్రుతి ఫస్ట్ టైమ్ జట్టుకట్టిన సందర్భాల్లో `డీఎస్పీ` ఫ్యాక్టర్ రిపీట్ అవుతూనే ఉండడం విశేషం. మరి.. `గబ్బర్ సింగ్`, `ఎవడు`లాగే `మెగా 154` కూడా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |