![]() |
![]() |
.webp)
నందమూరి హరికృష్ణ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్రవేశారు. ఆయన సినిమాలలో అందరికీ ఎక్కువగా గుర్తుండే సినిమా 'సీతయ్య'. ఇందులో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003 లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రీమేక్ లో నటిస్తే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ తో ఎంఎం కీరవాణి చెప్పగా.. ఒక కండిషన్ కి ఒప్పుకుంటే తప్పకుండా నటిస్తానని తారక్ అన్నాడు.
తారక్, చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్' ఈ నెల 25 న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హీరోలు తారక్, చరణ్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతయ్య సినిమా ప్రస్తావన వచ్చింది. సీతయ్య సినిమాకి కూడా కీరవాణినే సంగీతం అందించారు. అప్పట్లో సీతయ్య సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న కీరవాణి.. "సీతయ్య రీమేక్ చేస్తే దానిలో నటిస్తారా?.. అది చాలా పవర్ ఫుల్ పోలీస్ పాత్ర. నాకు ఇప్పటికి కూడా ఆల్ టైం ఫేవరెట్." అని తారక్ తో అనగా.. ''సీతయ్య రీమేక్ కి మళ్ళీ మీరే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తానంటే నేను చేస్తాను" తారక్ చెప్పాడు.

ఇక ఈ ఇంటర్వ్యూలో కీరవాణి సాంగ్స్ లో తనకి 'భీమవరం బుల్లోడా' సాంగ్ నచ్చదని, లిరిక్స్ ఇబ్బందికరంగా ఉంటాయని తారక్ అన్నాడు. అలాగే ఈ జెనరేషన్ సింగర్స్ లో మోహన భోగరాజు, గీత మాధురి వాయిస్ నచ్చుతుందని తారక్ చెప్పగా.. తనకి కూడా మోహన భోగరాజు వాయిస్, అలాగే మంగ్లీ వాయిస్ నచ్చుతుందని చరణ్ చెప్పాడు.
![]() |
![]() |