![]() |
![]() |
.webp)
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం `లైగర్` ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. విజయ్ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన `అర్జున్ రెడ్డి` (2017) విడుదల తేది అయిన ఆగస్టు 25ని టార్గెట్ చేసుకుని ఈ స్పోర్ట్స్ డ్రామా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీర్చిదిద్దారు.
ఇదిలా ఉంటే, `లైగర్` తరువాత పూరీ దర్శకత్వంలో `జనగణమన` చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు.. `నిన్ను కోరి`(2017), `మజిలీ`(2019) చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లోనూ ఓ రొమాంటిక్ డ్రామా చేయనున్నాడు విజయ్. ఇందులో విజయ్ దేవరకొండకి జోడీగా సమంత నటించబోతోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కాశ్మీర్ నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రం రూపొందనుందట. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ దర్శనమివ్వనున్నాడని సమాచారం. త్వరలోనే విజయ్ - శివ నిర్వాణ కాంబినేషన్ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరి.. రొమాంటిక్ సబ్జెక్ట్స్ తో ఇప్పటికే పలు హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమాతోనూ అదే బాట పడతాడేమో చూడాలి.
![]() |
![]() |