![]() |
![]() |

తెలుగు తెరపై సందడి చేసిన బాలీవుడ్ నటుల్లో బోమన్ ఇరానీ ఒకరు. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్`, `లగే రహో మున్నాభాయ్`, `3 ఇడియట్స్` వంటి హిందీ చిత్రాలతో పాపులర్ అయిన బోమన్.. 2013లో రిలీజైన `అత్తారింటికి దారేది`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తాతగా ఆకట్టుకున్నారు బోమన్ ఇరాని. ఆపై మాస్ మహారాజా రవితేజ `బెంగాల్ టైగర్`లోనూ, పవన్ `అజ్ఞాతవాసి`లోనూ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`లోనూ ఎంటర్టైన్ చేశారాయన.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరోసారి తెలుగు చిత్రంలో నటించబోతున్నారట బోమన్ ఇరాని. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం బోమన్ ఇరానిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. పాత్ర, పారితోషికం నచ్చడంతో బోమన్ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. త్వరలోనే ప్రభాస్ - మారుతి కాంబో మూవీలో బోమన్ ఇరాని ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |