![]() |
![]() |

మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్ బెస్ట్ హిట్స్ లో `లక్ష్యం` (2007) ఒకటి. ఈ సినిమాతోనే శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ఏడేళ్ళ గ్యాప్ తీసుకుని ఈ ఇద్దరు.. `లౌక్యం` (2014) కోసం మళ్ళీ జట్టుకట్టారు. మరో హిట్టు కొట్టారు. కట్ చేస్తే.. దాదాపు ఎనిమిదేళ్ళ అనంతరం గోపీచంద్, శ్రీవాస్ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కోల్ కతా నేపథ్యంలో సాగనుంది.
ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి తాజాగా `లక్ష్యం 2` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. అయితే, `లక్ష్యం`కి ఇది సీక్వెల్ మూవీనా లేదంటే సెంటిమెంట్ రీత్యా ఈ టైటిల్ పెట్టారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే గోపీచంద్ - శ్రీవాస్ థర్డ్ జాయింట్ వెంచర్ టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
కాగా, ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా `ఖిలాడి` బ్యూటీ డింపుల్ హయాతి కనువిందు చేసింది. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |