![]() |
![]() |

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మూవీ 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ 'కళావతి'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండో సాంగ్ ని విడుదలైంది.
'పెన్నీ' అంటూ సాగే సర్కారు వారి పాట రెండో సాంగ్ మ్యూజిక్ వీడియోని తాజాగా విడుదల చేశారు. ఈ మ్యూజిక్ వీడియోలో మహేష్ కూతురు సితార సందడి చేయడం విశేషం. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, స్టెప్స్ తో సితార ఆకట్టుకుంది. మొదటి వీడియోతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. మహేష్ ఎప్పటిలాగే హ్యాండ్సమ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ లో కొత్తదనం కనిపిస్తోంది. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. నకాష్ అజిజ్ మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ చేశాడు.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |