![]() |
![]() |

'బాహుబలి-1', 'బాహుబలి-2'తో తాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25 న విడుదల కానుంది. అయితే బాహుబలిలా ఈ సినిమా రెండు పార్ట్ లు ఉండదని రాజమౌళి గతంలోనే చెప్పారు. అయితే తాజాగా ఆయన 'ఆర్ఆర్ఆర్-2' ని కూడా త్వరలో విడుదల చేస్తామని చెప్పి ఆశ్చర్యపరిచారు. దానిలో నటీనటులు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావడం విశేషం.
శనివారం సాయంత్రం కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఏ రక్త సంబంధం లేకపోయినా కుటుంబసభ్యుల్లా ఉండే నా అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి ఇప్పుడు చెప్తానని.. గతంలో చాలాసార్లు హీరోల ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పలేదని కానీ ఈరోజు చెప్పి తీరుతాననని అన్నారు. కోడైరెక్టర్ కోటి, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను, శ్రీరామ్, కిరణ్, అనిల్, ఆన్ లైన్ ఎడిటర్ నాగార్జున, రాహుల్, సురేష్, సుధాకర్, సుబ్బు.. ఈ పదిమంది పిల్లర్స్ తన బలమని రాజమౌళి చెప్పారు. తాము షూట్ కి వెళ్ళడానికి ముందు టెస్ట్ షూట్ చేస్తామని.. అందులో హీరోలా, హీరోయిన్ లా, విలన్ లా ఇలా అన్ని క్యారెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్సే చేస్తారని తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అయ్యాక అసిస్టెంట్ డైరెక్టర్స్ నటించిన 'ఆర్ఆర్ఆర్' కూడా సెపెరేట్ గా విడుదల చేస్తామని అన్నారు. ఇప్పటికే ఎడిటింగ్ పూర్తయిందని, దానిని మించిన కామెడీ సినిమా ఉండదని, ఫుల్ గా నవ్వుకుంటారని రాజమౌళి చెప్పుకొచ్చారు.

అలాగే ఆర్ఆర్ఆర్ లో నటించిన చరణ్ ని హనుమంతుడితో, తారక్ ని రాముడితో పోల్చారు రాజమౌళి. చరణ్ ఆంజనేయస్వామి లాంటోడు అని తన బలం తనకి తెలియదని చెప్పారు. తారక్ శ్రీరాముడు లాంటోడు అని.. తన బలమేంటో, తాను ఏం చేయగలడో తనకు తెలుసని అన్నారు. చరణ్ గొప్పనటుడు కానీ తనకి తెలియదు, తారక్ గొప్ప నటుడు తనకి తెలుసు. ఇద్దరు గొప్ప నటులు తన సినిమాకి పనిచేయడం సంతోషంగా ఉందని రాజమౌళి తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి టికెట్ ధరలు పెంచేలా చేయడంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారని రాజమౌళి అన్నారు. ఆయనకు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడమే ఇష్టమని, కానీ మాకు మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్ద అని రాజమౌళి కొనియాడారు.
![]() |
![]() |