![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్ లో హవా సాగిస్తున్న కథానాయికల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. దాదాపుగా ఈ తరం అగ్ర కథానాయకులందరితోనూ ఈ అమ్మడు జట్టుకట్టేసింది. త్వరలో పట్టాలెక్కనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `భవదీయుడు భగత్ సింగ్`లోనూ హీరోయిన్ గా పూజ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆమె ఎంట్రీపై అధికారిక ప్రకటన రాబోతుందని బజ్.
ఇదిలా ఉంటే, తెలుగునాట రీసెంట్ టైమ్స్ లో పూజ చూసినన్ని హిట్స్ మరే నాయికకి దక్కలేదు. `అరవింద సమేత వీర రాఘవ`, `మహర్షి`, `గద్దలకొండ గణేశ్`, `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. ఇలా వరుస పెట్టి ఐదు విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ గ్లామరస్ యాక్ట్రస్. అలాంటి తరుణంలో.. ఈ మార్చి 11న రిలీజైన పాన్ - ఇండియా మూవీ `రాధే శ్యామ్`తో పూజ డబుల్ హ్యాట్రిక్ కొడుతుందని అందరూ భావించారు. పేలవమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ పిరియాడిక్ రొమాంటిక్ సాగా.. అనూహ్యంగా బాక్సాఫీస్ ముంగిట బోల్తా పడింది. దీంతో.. పూజా హెగ్డే స్పీడ్ కి బ్రేక్ పడ్డట్లయ్యింది. ఈ నేపథ్యంలో.. పూజకి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న `ఆచార్య`తో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన `ఆచార్య`లో మరో హీరోగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే దర్శనమివ్వనుంది. ఈ సోషల్ డ్రామాకి విజనరీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు.
![]() |
![]() |