![]() |
![]() |

కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అతి కొద్దిమంది కథానాయకుల్లో రాజ్ తరుణ్ ఒకరు. `ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావ`, `కుమారి 21 ఎఫ్` చిత్రాలతో ఈ `హ్యాట్రిక్` ఘనతని సాధించాడు తరుణ్. అలాగే, పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి మ్యాజిక్ ని కొనసాగించలేక సతమతమవుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.
సదరు హ్యాట్రిక్ హిట్స్ తరువాత వచ్చిన `సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు` ఫ్లాప్ కాగా.. ఆపై వచ్చిన `ఈడో రకం ఆడో రకం` (ఇందులో మంచు విష్ణు మరో హీరో),`కిట్టు ఉన్నాడు జాగ్రత్త` ఫర్లేదనిపించుకున్నాయి. ఇక ఆ తరువాత మాత్రం వరుస పరాజయాలే పలకరిస్తున్నాయి తరుణ్ ని.
`అంధగాడు`, `రంగుల రాట్నం`, `రాజు గాడు`, `లవర్`, `ఇద్దరి లోకం ఒకటే`, `ఒరేయ్ బుజ్జిగా`, `పవర్ ప్లే`, `అనుభవించు రాజా`తో పాటు తాజా చిత్రం `స్టాండప్ రాహుల్` వరకు రాజ్ హీరోగా నటించిన తొమ్మిది వరుస సినిమాలు నిరాశపరిచాయి. వీటిలో ఓటీటీ రిలీజెస్ కూడా ఉండడం గమనార్హం. మొత్తమ్మీద.. కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్ తరుణ్.. ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో ట్రాక్ తప్పాడన్నమాట. మరి.. రాబోయే చిత్రాలతోనైనా రాజ్ తరుణ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
![]() |
![]() |