![]() |
![]() |

గతేడాది చివరిలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నేచురల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'అంటే సుందరానికీ' షూటింగ్ పూర్తి చేశాడు. ఇది జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఇప్పుడు 'దసరా' సినిమాతో బిజీ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'దసరా'. ఇందులో నాని గతంలో ఎన్నడూ కనిపించని విధంగా విభిన్న లుక్ లో, మొరటుగా కనిపిస్తున్నాడు. తాజాగా షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ మూవీ నుంచి నాని లుక్ ని తాజాగా రివీల్ చేశారు. అసలు ఆ పోస్టర్ లో ఉంది నానినేగా అన్నంత కొత్తగా కనిపిస్తున్నాడు నాని. చెదిరిన జుట్టు, గడ్డంతో.. మాసిపోయిన లుంగీ, చొక్కా ధరించి.. నడుముకి మద్యం సీసాలు కట్టుకొని, మంటలో చెయ్యి పెట్టి చాలా మొరటు లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు.
.webp)
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
![]() |
![]() |