![]() |
![]() |

గత ఏడాది మార్చి సెన్సేషన్ `జాతి రత్నాలు`తో దర్శకుడిగా ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనుదీప్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ కెప్టెన్ కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే అవకాశముంది.
ఇదిలా ఉంటే, శివ కార్తికేయన్ కాంబో మూవీ పూర్తయ్యేలోపే మరో సినిమాని పట్టాలెక్కించనున్నాడట అనుదీప్. అది కూడా.. ఓ సీనియర్ టాప్ స్టార్ తో. ఆ వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ కి అనుదీప్ ఓ కథ చెప్పాడట. స్క్రిప్ట్ నచ్చడంతో వెంకీ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. అంతేకాదు.. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే వెంకీ - అనుదీప్ కాంబో మూవీపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
కాగా, వెంకీ తాజా చిత్రం `ఎఫ్ 3` మే 27న విడుదలకు సిద్ధమైంది. 2019 నాటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. మరోవైపు రానా దగ్గుబాటితో కలిసి `రానా నాయుడు` అనే పేరుతో ఓ వెబ్ - సిరీస్ చేస్తున్నారు వెంకీ.
![]() |
![]() |