![]() |
![]() |

తెలుగు నటుడు ఆది పినిశెట్టి, కన్నడ నటి నిక్కీ గల్రానీ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. కొవిడ్ ఫస్ట్ లాక్‌డౌన్ టైమ్‌లో చెన్నైలోని రవిరాజా పినిశెట్టి ఇంట్లో జరిగిన ఆది బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నిక్కీ కూడా కనిపించింది. ఆది, నిక్కీ కలిసి జంటగా మలుపు (తమిళంలో యాగవరాయినుమ్ నా కాక్క) అనే ద్విభాషా చిత్రంలో నటించారు. ఈ మూవీకి ఆది అన్న సత్యప్రభాస్ దర్శకుడు. ఈ సినిమా సెట్స్ మీదే నిక్కీ, ఆది మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రణయంగా మారింది. అప్పట్నుంచే ఆ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సమాచారం.
తాజాగా వినిపిస్తున్న దాని ప్రకారం ఆది, నిక్కీ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు. వారి పెళ్లికి ఇరువురి కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలిపారని అంటున్నారు. ఏప్రిల్‌లో ఉగాది పండగ తర్వాత వారి నిశ్చితార్ధం ఉంటుందని తెలుస్తోంది. నిక్కీ ఎవరో కాదు.. తెలుగులో పలు సినిమాల్లో నటించిన సంజనా గల్రానీకి స్వయానా చెల్లెలు. కృష్ణాష్టమి మూవీలో సునీల్ సరసన నాయికగా నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నిక్కీ.
మరోవైపు ఆది ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్‌గా, ఇంకోవైపు రంగస్థలం లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలైన క్లాప్ మూవీలో హీరోగా ఉన్నత స్థాయి నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తోన్న ది వారియర్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు.
![]() |
![]() |