![]() |
![]() |

వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేయగా గత శుక్రవారం విడుదలైన హిందీ ఫిల్మ్ 'ద కశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ దగ్గర నమ్మశక్యం కాని వసూళ్లతో దుమ్మురేపుతోంది. రోజు రోజుకూ ఆ సినిమా కలెక్షన్లు పెరుగుతూ, విశ్లేషకుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. శుక్రవారం ఎనిమిదో రోజు 'ద కశ్మీర్ ఫైల్స్' కు వచ్చిన కలెక్షన్లు చూస్తే ఎవరికైనా అదే ఫీలింగ్ కలుగుతుంది. విడుదలైన 8వ రోజు ఈ సినిమాకు 19.15 కోట్లు (నెట్) వచ్చాయి.
ఆమిర్ ఖాన్ రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్ 'దంగల్'కు ఎనిమిదో రోజు వచ్చింది రూ. 18.59 కోట్లు. అంటే ఆ సినిమాని కూడా 'ద కశ్మీర్ ఫైల్స్' దాటేసిందన్న మాట. 8వ రోజు కలెక్షన్లలో ఈ సినిమా కంటే ముందున్నది రాజమౌళి ఎపిక్ మూవీ 'బాహుబలి 2' (హిందీ వెర్షన్) మాత్రమే. ఆ సినిమా 19.75 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్స్ లిస్టులో చేరడానికి ఉరకలేస్తోన్న 'ద కశ్మీర్ ఫైల్స్' ఇప్పటిదాకా రూ. 116.45 కోట్ల (నెట్)ను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఓ సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడం ఏ రకంగా చూసినా అసాధారణం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే విడుదలైన రెండు వారాల లోపే ఈ సినిమా రూ. 150 కోట్ల మార్కును దాటేస్తుందని ఈజీగా చెప్పేయవచ్చు. 1990లలో కశ్మీరీ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో కశ్మీరీ పండిట్లు ఎలాంటి దారుణాలను చవిచూశారో ఈ సినిమాలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చూపించాడు. జీ స్టూడియోస్‌తో కలిసి తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మించారు.
![]() |
![]() |