![]() |
![]() |

తెలుగునాట వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో ఇ.వి.వి. సత్యనారాయణ ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. వాటిలో `సీతారత్నం గారి అబ్బాయి` ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సీతారత్నంగా కళాభినేత్రి వాణిశ్రీ అలరించగా, టైటిల్ రోల్ లో వినోద్ కుమార్ ఎంటర్టైన్ చేశాడు. వినోద్ కుమార్ కి జంటగా రోజా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, శ్రీకాంత్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, నిర్మలమ్మ, అలీ, జిత్ మోహన్ మిత్రా ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎల్బీ శ్రీరామ్ సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రాజ్ - కోటి సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలకు వేటూరి సుందరరామ్మూర్తి, `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువన చంద్ర సాహిత్యమందించారు. పాటల్లో ``మేఘమా మరువకే`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``మత్తుగా గమ్మత్తుగా``, ``ఆ పాపి కొండల్లో``, ``నా మొగుడే బ్రహ్మచారి``, ``పసివాడో ఏమిటో`` గీతాలు కూడా రంజింపజేశాయి. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన `సీతారత్నం గారి అబ్బాయి`.. 1992 మార్చి 19న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |