![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా ఒక్కో టికెట్ కి రూ.75 పెంచుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజుల క్రితం వరకు ఏపీలో సినిమా టికెట్ ధరలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. రెమ్యునేషన్స్ కాకుండా 100 కోట్లకు పైగా బడ్జెట్ అయిన సినిమాలకు పదిరోజుల పాటు ప్రత్యేక ధరల వెసులుబాటు కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో సోమవారం 'ఆర్ఆర్ఆర్' దర్శక నిర్మాతలు రాజమౌళి, డీవీవీ దానయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యి తమ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందించారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఒక్కో టికెట్ పై 100 రూపాయలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం 75 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి పదిరోజుల పాటు అమలులో ఉంటాయి.
![]() |
![]() |