![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. '#NN1' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ లుక్ ని తాజాగా రివీల్ చేశారు. పోస్టర్ లో నితిన్ చేతిలో సిగరెట్ పట్టుకొని కాలుస్తూ కనిపిస్తున్నాడు. అలాగే ఫస్ట్ లుక్ ని రేపు మధ్యాహ్నం 12:30 కి విడుదల చేస్తున్నట్లుగా పోస్టర్ లో పేర్కొన్నారు.

శ్రీ వేదాక్షర మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇది టోవినో థామస్ హీరోగా నటించిన 'తీవండి' అనే మలయాళ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది.
![]() |
![]() |