![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో అత్యధిక థియేటర్లలో విడుదలకు సర్వసిద్ధంగా ఉంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని కీలక పాత్రలు చేసిన ఈ సినిమా కోసం సినీ ప్రియులు అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించిన ఈ సినిమాని కల్పిత కథతో రాజమౌళి రూపొందించారు.
కాగా, ఏకంగా మూడు గంటలకు పైగా సెల్యులాయిడ్‌పై 'ఆర్ఆర్ఆర్'ను మనకు చూపించబోతున్నారు జక్కన్న. అవును. ఈ మాగ్నమ్ ఓపస్ నిడివి అక్షరాలా.. 186 నిమిషాలు. ఈ మేరకు సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్ ధ్రువీకరించింది. ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. అంటే 12 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ సినిమాని థియేటర్లలో చూసే అవకాశం ఉంది.
ఇవాళ్టి రోజుల్లో మూడు గంటల సినిమా అంటే.. 'అమ్మో.. అంత లెంగ్తా?' అని చాలామంది భయపడిపోయే స్థితి. అంతసేపు థియేటర్లలో కూర్చొనే ఓపిక ఎవరికుంటుంది బాబూ అనేవాళ్లే అంతా! అందుకే ఇవాళ అత్యధిక సినిమాలు రెండున్నర గంటలోపు నిడివితోనే కనిపిస్తున్నాయి. అయితే రాజమౌళి సినిమా అంటే.. ఆ కిక్కే వేరు కాబట్టి లెంగ్త్‌తో సంబంధం లేకుండా జనం చూస్తారని విశ్లేషకులు సైతం అంగీకరించే మాట. పైగా ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటించిన సినిమా కాబట్టి ఆ మాత్రం లెంగ్త్ ఉండకపోతే ఎలా? అంటున్నారు ఫ్యాన్స్. సో.. నిడివితో సంబంధం లేకుండా ఎంతసేపైనా థియేటర్లలో కూర్చొని ఆర్ఆర్ఆర్ను చూడ్డానికి వారు ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం.. ఇంత పెద్ద సినిమా ఇంకెన్ని పెద్ద సంచలనాలు సృష్టిస్తుందో!

![]() |
![]() |